¡Sorpréndeme!

Ind vs Nz Champions Trophy 2025 Final | ఛాంపియన్స్ ట్రోఫీ 2025 విజేతగా టీమిండియా | ABP Desam

2025-03-09 7 Dailymotion

   రోహిత్ శర్మ సైన్యం అదరగొట్టేసింది. పుష్కరం కల తీర్చేసింది. 12ఏళ్ల తర్వాత టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలిచింది. 2013 లో ధోనీ కెప్టెన్సీలో ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన భారత్..తిరిగి 12 ఏళ్ల తర్వాత అద్భుతమైన విజయం సాధించింది. ఫైనల్లో న్యూజిలాండ్ ను చిత్తు చేస్తూ మినీ వరల్డ్ కప్ ను ముద్దాడింది భారత్. న్యూజిలాండ్ విసిరిన 252 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కెప్టెన్ రోహిత్ శర్మ మరోసారి సెల్ఫ్ లెస్, ఫియర్ లెస్ బ్యాటింగ్ తో అదరగొట్టాడు. 83 బంతుల్లో రోహిత్ కొట్టిన 76పరుగులతో టీమిండియా అదిరిపోయే ఆరంభాన్ని అందుకుంది. రోహిత్ తో పాటు గిల్ 31పరుగులు చేయటంతో ఓపెనింగ్ భాగస్వామ్యమే 105 పరుగులు పెట్టారు. గిల్ కొట్టిన బాల్ ను ఫిలిప్స్ కళ్లు చెదిరే రీతిలో పట్టుకోవటం...విరాట్ కొహ్లీ 1పరుగుకే బ్రేస్ వెల్ బౌలింగ్ లో ఎల్బీ గా వెనుదిరగటంతో కాస్త ప్రెజర్ మన బ్యాటర్ల మీద ప్రెజర్ పెరిగింది.  రోహిత్ శర్మను 76పరుగులకు రచిన్ రవీంద్ర ఔట్ చేస్తే...శ్రేయస్ అయ్యర్, అక్సర్ పటేల్ మళ్లీ టీమ్ ను నిలబెట్టారు. అయ్యర్ 48 పరుగులు చేసి తృటిలో హాఫ్ సెంచరీ మిస్ అయ్యితే...అక్సర్ 29 పరుగులు కొట్టాడు. కేఎల్ రాహుల్ పాండ్యా, జడేజాతో కలిసి మిగిలిన పనిని పూర్తి కూల్ గా పూర్తి చేశాడు. జడ్డూ ఫోర్ తో మ్యాచ్ ఫినిష్ చేసేశాడు. భారత్ మరో ఓవర్ మిగిలి ఉండగానే నాలుగు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి మినీ వరల్డ్ కప్ ను మూడోసారి ముద్దాడింది టీమిండియా. ఆటగాళ్లు సంబరాల్లో మునిగిపోయారు. 2024లో కెప్టెన్ గా టీ20 వరల్డ్ కప్ ను గెలిపించిన రోహిత్ శర్మ.. 2025 లో కెప్టెన్ గా ఛాంపియన్స్ ట్రోఫీ ని ముందుండి గెలిపించి వరుసగా రెండో ఏడాది ఐసీసీ ట్రోఫీని అందించాడు.